NEWS

​షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం.

కాకినాడ రూరల్ : మండలంలోని ఇంద్రపాలెం బ్రాహ్మణ అగ్రహారం వీధిలో నల్లజర్ల వెంకట్రావు డాబా ఇల్లు పై అంతస్తులో ఉదయం 8:30గంటల ఆ ప్రాంతంలో పాత ఏసీ షార్ట్ సర్క్యూట్ అయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది, ఇంటి యజమాని తెలిపిన వివరాల ప్రకారం రూ.5 లక్షలు నష్టం వాటిల్లింది. 

పై అంతస్తులో రెండు గదులు అగ్నికి ఆహుతయ్యాయి. ఒక గ్యాస్ సిలెండర్ పేలడంతో ఇంటి గోడలు బీటలు ఇచ్చాయి. అగ్నిమాపక అధికారులు హుటాహుటీన మంటలను అదుపు చేయడంతో ప్రాణనష్టం సంభవించలేదు.

Y.S.V.V. SUNEEL KUMAR
Kumarjournalist555@gmail.com
9642213459

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics