NEWS

​”అల్ల”కల్లోలం  , ఈదురుగాలులకు భయపడుతున్న ప్రజలు ,అధికారులు జాడేది…

తీరంలో ఎమ్మెల్యే వర్మ సుడిగాలి పర్యటన 

పిఠాపురం : బంగాళాఖాతంలో ఏర్పడిన  ఫైథాయి తుఫాన్ తో ఉప్పాడ సముద్రతీరం అల్లకల్లోలంగా మారింది. తుఫాను కారణంగా భారీ స్థాయిలో ఈదురుగాలులు వీయడంతో జనజీవనం స్తంభించింది. జిల్లా అధికారులు తీర ప్రాంతంలో  పర్యటించి స్థానిక అధికారులు చర్యలు చేపట్టాలని తెలుపుతున్న స్థానిక అధికారులు ఎక్కడా కానరాలేదని మత్స్యకారులు తెలుపుతున్నారు. సముద్ర  తీరానికి అతిదగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా అధికారులు తెలుపుతున్న ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు.


 కనీసం పునరావాస కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పవలసిన అధికారులు తెలపకపోవడంతో బిక్కు బిక్కుమంటూ వారి గృహాల వద్ద  వున్నారు. ఇప్పటికే మత్స్యకారులు వేట నిలుపుదల చేసి బోట్లను ఒడ్డుకు చేర్చారు. సహాయ సహకారాలు అందివ్వాల్సిన అధికారులు కానరాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. తీరం దాటే సమయంలో తుఫాను పెను తుఫానుగా మారే ప్రమాదం ఉందని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ఉప్పాడ, సుబ్బంపేట, అమీనాబాదు, నాయికలు కాలనీ, కోనపాపపేట, తదితర గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. శనివారం తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలపడంతో స్థానిక ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ ఉప్పాడ తీర ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనచేసి మత్స్యకారులకు పలు జాగ్రత్తలు సూచించారు.
Y.S.V.V. SUNEEL KUMAR
Kumarjournalist555@gmail.com
Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics