NEWS

​తుపాను ప్రభావిత ప్రాంతాల్లో –  యెనిమిరెడ్డి పర్యటన

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో భాజాపా జిల్లా అధ్యక్షులు యెనిమిరెడ్డి మాలకొండయ్య పర్యటన 

కాకినాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుఫాను ప్రభావిత నిర్వాసితుల శిబిరం వద్దకు ఈరోజు భాజాపా జిల్లా అధ్యక్షులు శ్రీ యెనిమిరెడ్డి మాలకొండయ్య బృందం తో వెళ్లారు.  ఇందులో భాగంగా ఆయన కాకినాడ సీపోర్ట్ ఆఫీసర్ ని కలిసి హోప్ ఐలాండ్ నుండి తరలించిన నిర్వాసితుల గురించి, వారికి చేసిన ఏర్పాట్లు గురించి అడిగి తెలుసుకున్నారు. 


ఉప్పాడ లో గల పునరావాస కేంద్రంలో ఏర్పాట్లు ఆయన తనికీ చేసి అక్కడి తహశీల్దారు కి బాధితులకు చేయవలసిన ఏర్పాట్ల పై సూచనలు ఇచ్చారు. సముద్రంలో వేటకు వెళ్లిన బోటు లలో 4 ఇంకా తిరిగి రాలేదు అని, అందులో రెండింటిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన మరో రెండు ఆచూకి తెలిసిన అక్కడి పరిస్థితులకు నావికాదళం కానీ ఎన్డీఆర్ఎఫ్ బోట్లు కానీ వెళ్లాలని పరిస్థితి నెలకొంది అని , వాళ్ల నుంచి చివరగా వచ్చిన సమాచారం ప్రకారం వాళ్లు ఒక ఆయిల్ రిగ్గు వద్ధ ఉన్నామని చెప్పారు అని, కానీ ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదని వారిని ఎలాగైనా తీసుకు రావాలని ఆయన కోరారు, ఫిషరీస్  వారితో మాట్లాడుతే అక్కడికి బోట్లు వెళ్లడం కష్టమైన పని అని హెలీకాప్టర్ ద్వారా శోధన చేస్తే ఖచ్చితంగా ఆచూకి దొరికే పరిస్థితి ఉంది అని అన్నారని, అధికారులు ఎలాగైన దీనిపై దృష్టి సారించి వారిని కాపాడాలని కలెక్టర్ ని కోరారు ఈ విషయం పై సీఎం ఆఫీసు కిీ పీఎం  ఆఫీసు కి కూడా సమాచారం అందించామని తెలిపారు. ఈ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ తీసుకున్న చర్యల పై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బృందంలో ఆయనతో పాటు కెంగం హరి రామ ప్రసాద్, కవికొండల బీమశంఖర్, చీపూరి వాసు, కోక్కిలిగడ్డ గంగరాజు పాల్గొన్నారు. 

R.prasanna Kumar 9182318880

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics

Subscribe via Email

Enter your email address to subscribe to this NEWS portal and receive notifications of new posts by email.

Join 543 other subscribers

Any one can Send Us NEWS -Publish@mydigitalnews.in ,santhosh@mydigitalnews.in , 888 5555 924 Whatsapp Dismiss