NEWS

జగన్ అన్న గురించి ఏమైనా రాయమంటే ఏం రాయను…

అక్షరం ముక్క రాని వాల్మీకి రామ నామ జపంతో రామాయణం రాసినట్టు… జగన్మోహనుని పారాయణం రాయనా???

పగబట్టిన రాబందుల పాలిట సింహస్వప్నంలా చిరునవ్వు అనే ఆయుధం తో ఎక్కడా అదరకుండా బెదరకుండా ఉండే ఆ ధైర్యం గురించి రాయనా???

తన బాధను పరమశివుడిలా కంఠం లో నిలుపుకొని జనం సాదక బాదకాలను అడుగుతూ నేనున్నా.. మనందరి ప్రభుత్వం వస్తుందని భరోసా ఇచ్చే బాటసారి గురించి రాయనా???

న్యాయాన్ని గౌరవించి, రాజకీయ రంగం లో విలువలను కాపాడే విషయంలో రేపటి తరానికి దిక్షూసి గురించి రాయనా???

కత్తి దూసినా… దూరదృష్టి తో నాకేం కాలేదు నేను బాగానే ఉన్నా…అని జనం భావోద్వేగాలను అణచివేసి రాష్ట్రం బాగోగుల గురించి ఆలోచించిన జనోద్దారకుడి గురించి రాయనా???

రాస్తా….

నవ నూతన శఖానికి నాంది పలికే సమ్మోహన అస్త్రం మన జగన్మోహనుని గురించి రాస్తా…

పాలన అంటే వేదన, ఆవేదన కాదు తండ్రి లాంటి ఆలనా, పాలన అని చాటి చెప్పే పాలనాదక్షుడి గురించి రాస్తా…

అధికారం అంటే ప్రజలను అంధకారం లోకి తోయడానికి ఇచ్చిన పెటెంటుకాదు.. ప్రజా రక్షణకు ఓటు రూపంలో ఇచ్చే పేమెంటు అని నిరూపించేలా పాలనను అందజేసే మన సంరక్షకుడి గురించి రాస్తా…

జీవం పోయి శవం లా మారిన రాజకీయాలకు జవసత్వాలనిచ్చే జనగన నాయకుని గురించి రాస్తా…

ఎప్పుడూ ఒక మనిషి గురించి ఆలోచిస్తూ తపిస్తూ ఉంటే #ప్రేమ అంటారంట‌‌‌…

ఒక వ్యక్తి ని  ఆరాదిస్తూ ఆ వ్యక్తి నడవడికలు పాటిస్తుంటే #ఆదర్శం అంటారంట…

అదే వ్యక్తి లక్షణాలలో పది శాతం ఉంటే నాయకుడు అనిపించుకుంటారంట…

అలాంటి వ్యక్తి మన జననేత జగన్ అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, ఇలాంటి నాయకుడిని మనకిచ్చిన దేవునికి కృతజ్ఞతలు. అలాగే ఆయన సంపూర్ణ ఆయు, ఆరోగ్య, సుఖ, సంతోషాలతో కుటుంబం సభ్యులు మరియు శ్రేయోభిలాషుల మద్య జరుపుకోవాలని మన:పూర్వకంగా కోరుకుంటూ..

మీ 

వై యస్ ఆర్ కుటుంబం, బెంగళూరు.

Written by : Kumar Swami Reddy Pulivendula 

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics