NEWS

​పెథాయ్‌ బాధిత రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి- అనిశెట్టి

పెథాయ్‌ తుఫాను బాధిత రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి-జనసేన సమన్వయ కమిటీ సభ్యుడు అనిశెట్టి ,

పిఠాపురం: ఇటీవల సంభవించిన పెథాయ్‌ తుఫాను వల్ల నష్టపోయిన బాధిత రైతాంగాన్ని ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోవాలని పిఠాపురం నియోజకవర్గ జనసేన సమన్వయ కమిటీ సభ్యుడు అనిశెట్టి వెంకట సుబ్బారావు కోరారు. 


గొల్లప్రోలు మండలంలో తుఫాను వల్ల నష్టపోయిన వన్నెపూడి, తాటిపర్తి, దుర్గాడ, చేబ్రోలు గ్రామాలలో వాణిజ్య పంటలను అనిశెట్టి పరిశీలించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ టమాట, మిర్చి, ప్రత్తి, ఉల్లి, మొక్కజొన్న పంటలకు అపార నష్టం సంభవించిందని, వ్యవశాయ శాఖ పూర్తిస్థాయిలో పంటనష్టం వివరాలను నమోదు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. గతంలో ఇదే విధంగా తుఫాన్లు, భారీ వర్షాలు సంభవించిన సమయంలో రైతులు పంటలు కోల్పోయి అపార నష్టం సంభవించినా ప్రభుత్వం నుండి ఏ విధమైన నష్టపరిహారం అందలేదని బాధిత రైతులు అనిశెట్టికి ఈ సంధర్భంగా మొరపెట్టుకున్నారు. ఈ ధఫా పంట నష్టపోయిన రైతులు అందరికీ పరిహారం లభించేలా అధికారులు చర్యలు గైగొనాలని విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు బాలిపల్లి రాంబాబు, కర్నిడి శ్రీను, చక్కపల్లి ధర్మరాజు, సిద్ధా నారాయణరావు, మొగిలి రాజా, తలారి శ్రీను, సుబ్సు, చంటి, ఎర్ర గంగాధర్‌, రైతులు వున్నారు.

Y.S.V.V.Suneel Kumar
kumarjournalist555@gmail.com.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in.

Topics