NEWS

​పవన్‌ కళ్యాణ్‌ మత్స్యకారులకు దత్తపుత్రుడు – అనిశెట్టి

మత్య్సకారులకు జనసేన ఎప్పుడు అండగా వుంటుంది,​పవన్‌ కళ్యాణ్‌ మత్స్యకారులకు దత్తపుత్రుడు.-రిటైర్డ్‌ ఇంజనీరింగ్‌ ఛీఫ్‌ అనిశెట్టి

పిఠాపురం : జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ మత్స్యకారులకు దత్తపుత్రుడని ఆ పార్టీ పిఠాపురం నియోజకవర్గ సమన్వకమిటీ సభ్యుడు, రిటైర్డ్‌ ఇంజనీరింగ్‌ ఛీఫ్‌ అనిశెట్టి వెంకట సుబ్బారావు అన్నారు. మత్స్యకార కుటుంబాలకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా వుంటుందని తెలిపారు. నియోజకవర్గంలోని యు.కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామంలో బుధవారం ఆయన పర్యటించి, మత్య్సకార కటుంబాలను పరామర్శించారు. పెథాయ్‌ తుపాను కారణంగా సముద్రం ఒడ్డున నివశిస్తున్న మత్య్సకార కుటుంబాలకు నిత్యవసర వస్తువు కిట్లు పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ ఆదేశాల మేరకు పెథాయ్‌ తుపాను కారణంగా నష్టపోయిన తీరప్రాంత మత్య్సకార కుటుంబాలకు నిత్యవసర వస్తువు కిట్లు పంపిణీచేయడం జరిగిందన్నారు. ఈ కిట్లలో 5కేజీలు బియ్యం, మూడు రకాల కూరగాయాలు, పావుకేజి కందిపప్పు ఇవ్వడం జరిగిందని, సుమారు 50 కుటుంబాలకు ఈ కిట్లను పంపిణీ చేశామన్నారు. తుపాను వచ్చే ముందు, తుపాను వెళ్లిపోయాక అధికారులు వచ్చి వెళ్ళారే తప్ప తమ గోడు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నా మత్స్యకారులకు అన్యాయం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కూలీన ఇళ్ళకు పూర్తిస్థాయిలో పక్కాఇళ్ళు కట్టించి ఇవ్వాలన్నారు. సామాగ్రి అందుకున్న మత్య్సకార కుటుంబీకులు అనిశెట్టికి హార్షద్వానాల మధ్య జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో సమన్వయకమిటీ సభ్యుడు బాలిపల్లి రాంబాబు, కర్నిడి శ్రీను, తోలేటి శిరీష, జనసేన సోషల్‌ జస్టిస్‌ విభాగం సలాది బాబులు, గంగుమళ్ల మణికంఠ, అనిశెట్టి బుచ్చిరాజు, చెక్కపల్లి ధర్మరాజు, సిద్ధా నారాయణ రావు, మొగిలి రాజా, దుర్గా ప్రసాదు, రాజు తదితర జనసైనికులు పాల్గొన్నారు.
Y.S.V.V. SUNEEL KUMAR
Kumarjournalist555@gmail.com
9642213459

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics