NEWS

​నాదెండ్లను కలిసిన అనిశెట్టి

పిఠాపురం : మాజీ శాసనసభ స్పీకర్‌, జనసేన రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర్‌ను సోమవారం పిఠాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, రిటైర్డ్‌ ఇంజనీరింగ్‌ చీఫ్‌ అనిశెట్టి వెంకట సుబ్బారావు, బాలిపల్లి రాంబాబులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సంధర్భంగా అనిశెట్టి మనోహర్‌తో పిఠాపురం నియోజకవర్గ సమస్యలపై చర్చించారు. ఏలేరు ఆధునీకరణ పనుల్లో అవినీతి జరిగిందని, స్థానిక సమస్యలపై తాము పోరాడుతున్నామని తెలిపారు. నియోజకవర్గంలో జనతరంగం కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించామన్నారు. మనోహర్‌ సమన్వయ కమిటీ సభ్యులతో మాట్లాడుతూ జనసేన పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళేందుకు కృషి చేయాలని, పార్టీ మ్యానిఫెస్టోని ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు. స్థానిక సమస్యలపై పోరాడుతున్న జనసేన పిఠాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులను ఈ సంధర్భంగా ఆయన అభినంధించారు. నాదెండ్లను కలిసిన వారిలో తోలేటి శీరిష, మొగిలి రాజా, తలారి శ్రీను వున్నారు.
Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics