NEWS

​ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు శుభాకాంక్షలు  తెలిపిన జనసేన- కురుమళ్ళ

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు
శుభాకాంక్షలు  తెలిపిన జనసేన నాయకు కురుమళ్ళ  రాంబాబు 
పిఠాపురం : క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురంలో  క్రైస్తవ సోదరులు క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చర్చిలన్నీ విద్యుత్‌ దీపాలంకరణతో ముస్తాబు చేశారు. ఉదయాన్నే క్రైస్తవ సోదరులు అందరూ ఆయా చర్చిలకు చేరుకొని ప్రార్థలను నిర్వహించారు. స్థానిక గ్యాస్‌ కంపెనీ వద్ద గల ఫుల్‌ గాస్పల్‌ చర్చ్‌ ఆఫ్‌ క్రైస్ట్‌ చర్చిలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రదర్‌ అబ్రహం రచించిన ఆశ్చర్యకరుడవు అనే రచించిన పాటల సీడీని కురుమళ్ళ రాంబాబు ఆవిష్కరించారు. 
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ ఎంపిపి, పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు కురుమళ్ళ రాంబాబు పాల్గొని క్రైస్తవ సోదరులకు నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్‌ గ్రీటింగ్స్‌ తెలియజేశారు. అనంతరం క్రిస్మస్‌ కేక్‌ను కట్‌ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల యేసు పుట్టుకను గూర్చి తెలిపే ఈ క్రిస్మస్‌ను క్రైస్తవ సోదరులకు ఎంతో ప్రాముఖ్యమైనదని, ప్రపంచమంతా ఈ రోజు వేడుకలు జరుపుకుంటుందని అది ఏసుప్రభువుకు ఉన్నటువంటి ఘనతని అన్నారు. లోక రక్షకుడు కరుణామయుడైన యేసు ఈ లోకమునకు వచ్చి పాపులను పాప బంధకమునుండి విముక్తి చేయుటకు ఆయన ప్రాణాన్ని సైతం అర్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి బ్రదర్‌ స్టీఫెన్‌ రాజు, అబ్రహం, మాజీ డిఎస్పీ రాజబాబు, మాజీ జెడ్పీటిసి పిట్టా మాధురి, మాసేన్‌ రెడ్డి, వీరబాబు(రథసారధి) తదితరులు పాల్గొన్నారు.
Y.S.V.V. Suneel Kumar
kumarjournalist555@gmail.com
9642213459

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics