NEWS

​క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న అనిశెట్టి.

పిఠాపురం : క్రిస్మస్‌ సంధర్భంగా నియోజకవర్గంలో జరిగిన వేడుకల్లో నియోజకవర్గ జనసేన సమన్వయ కమిటీ సభ్యుడు, రిటైర్డ్‌ ఇంజనీరింగ్‌ ఛీఫ్‌ అనిశెట్టి వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. పట్టణంలో 3వ వార్డు గొల్లపేట, యు.కొత్తపల్లి మండంలోని మూపేట ఎస్‌ఈజెడ్‌ కాలనీలో, గొల్లప్రోలు మండలంలోని పలు చర్చిల్లో ఆయన పాల్గొని క్రిస్మస్‌ కేకును కట్‌ చేసి పంపిణీ చేశారు. అలాగే ప్రతీ చర్చిలో 200 మందికి కేకులు పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ సిఎం కావాలని, రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్ధులు గెలవాలని  ప్రత్యేక ప్రార్థనలు చేశారన్నారు. 

పవన్‌ కళ్యాణ్‌ వస్తేనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. అలాగే క్రిస్మస్‌ సందర్భంగా అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని ప్రార్థనలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు బాలిపల్లి రాంబాబు, కర్నిడి శ్రీను, సలాది బాబులు, తోలేటి శిరీష, గంగుమళ్ళ మణికంఠ, మొగిలి రాజా, తలారి శ్రీను, సిద్ధ నారాయణరావు, అనిశెట్టి బుచ్చిరాజు, బాలిపల్లి అనిల్‌, పల్లికెల సునీత్‌, కొట్టేటి రాజేష్‌ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

Y.S.V.V. Suneel Kumar
kumarjournalist555@gmail.com

Topics