NEWS

​చరిత్రలో జనవరి, 1

చరిత్రలో ఈ రోజు

జనవరి, 1

సంఘటనలు

630: ముహమ్మద్ ప్రవక్త మక్కాకు వెళ్ళి, అక్కడ ఒక్క  రక్తపు బొట్టు చిందించకుండా దాన్ని జయించారు.

1899: క్యూబా స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందింది

1877: ఇంగ్లాండు రాణి విక్టోరియాని భారత దేశపు మహారాణిగా వెల్లడించారు

1877: 1866 నాటి కరువులో పూటకు ఎనిమిది వేల మందికి గంజి ఇచ్చి వేలాదిమంది ప్రాణాలు కాపాడిన బుడ్డా వెంగళరెడ్డి గారికి సన్మాన సభ ఢిల్లీలో 1877 జనవరి 1వ తేదీన జరిగింది.

1953: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ స్థాపించబడింది.

1956: సూడాన్ స్వాతంత్ర్యం పొందింది.

1958: యూరోపియన్ కమ్యూనిటీ స్థాపించబడింది.

1960: కామెరూన్ స్వాతంత్ర్యం పొందింది

1972: మణిపూర్‌ రాష్ట్రం అవతరించింది.

1973: ఫీల్డు మర్షల్ ఎస్.హెచ్.ఎఫ్.జె. మానెక్‌షా భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.

1993: చెకొస్లోవేకియా చెక్, స్లోవక్ రెండు దేశాలుగా విడిపోయింది.

1995: GATT స్థానంలో ప్రపంచ వాణిజ్య సంస్థ అమలులోకి వచ్చింది.

1999: యూరో కరెన్సీ చెలామణిలోకి వచ్చింది.

2007: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బాబ్ కి మూన్ పదవీబాధ్యతలు చేపట్టాడు.

జననాలు

1766: మహారాజా చందు లాల్, హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా, పేష్కరుగా పలు హోదాల్లో పనిచేసిన రాజకీయవేత్త. (మ.1845)

1840: బుడ్డా వెంగళరెడ్డి, 1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత. (మ.1900)

1911: ఎల్లాప్రగడ సీతాకుమారి, ప్రముఖ కథా రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు.ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యురాలు.

1939: సత్యమూర్తి, వ్యంగ్య చిత్రకారుడు.

1952: నానా పటేకర్, నటుడు.

1962: మారొజు వీరన్న, తెలంగాణ మహాసభను స్థాపకుడు, సి.పి.ఐ. (యం.యల్) జనశక్తి కార్యకర్త. (మ.1999)

1971: కళాభవన్ మణి, భారతీయ సినిమా నటుడు మరియు గాయకుడు. (మ.2016)

1975: సొనాలి బింద్రే, హిందీ నటి.

1978: విద్యా బాలన్, హిందీ నటి.

1979: డింకో సింగ్, 1998 ఆసియా క్రీడలలో బంగారుపతకం గెలుచుకున్న భారత బాక్సింగ్ క్రీడాకారుడు.

1982: ఐశ్వర్య ధనుష్ భారతీయ సినీ దర్శకురాలు. ఆమె ప్రముఖ భారతీయ నటుడు రజినీకాంత్ పెద్ద కుమార్తె.

మరణాలు

1748: జొహాన్ బెర్నౌలీ, స్విట్జెర్లాండ్కు చెందిన గణిత శాస్త్రవేత్త.

1775: అహమ్మద్ షా బహదూర్, 13 వ మొఘల్ చక్రవర్తి. (జ.1725)

1940: పానుగంటి లక్ష్మీ నరసింహరావు, ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత (జ.1865)

1955: శాంతిస్వరూప్‌ భట్నాగర్‌, ప్రముఖ రసాయనశాస్త్రవేత్త. ఈయన పేరుమీదే శాంతిస్వరూప్ భట్నాగర్‌ అవార్డును ఏర్పాటు చేసారు.

1964: శొంఠి వెంకట రామమూర్తి బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రసిద్ధ గణితశాస్త్రవేత్త. (జ.1888)

1994: చాగంటి సోమయాజులు, ప్రముఖ తెలుగు రచయిత. (జ.1915)

2001: ఆరుట్ల కమలాదేవి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు.(జ.1920)

2007: డూండీ, ప్రసిద్ధ తెలుగు సినిమా నిర్మాత.
పండుగలు మరియు జాతీయ దినాలు

-ప్రపంచ వ్యాప్తంగా క్రొత్త సంవత్సరం జరుపుకుంటారు

-రహదారి భద్రతా దినోత్సవం.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics