Competitive

“వందేమాతరం” మన జాతీయ గీతమా లేక “జనగణమన”..??

By-Mr. Vijay- vijjuvijju190@gmail.com

(ఈ వ్యాసం “రాజీవ్ దీక్షిత్” గారి ఒకే ప్రసంగంలో నుండి చిన్న భాగం..!!)
((రాజీవ్ దీక్షిత్ గారు ఒక శాస్త్రవేత్త లా పనిచేసి…అంత మంచి హోదా ఉన్న ఉద్యోగం వొదిలి… దేశ గతి-విధిని చూసి చలించి… భారత చరిత్రని… పరిశోధనాత్మకంగా వెలికితీసి… పక్కా ప్రమాణ పత్రాల ఆధారాలను… వాటి అసలు ప్రతుల నకలు లేఖనాలను తన వద్ద ఉంచుకొని…ఆయన ప్రసంగాలు చేయడం జరగింది..!!))

“వందేమాతరం” మన జాతీయ గీతమా లేక “జనగణమన”..??

దీనికి “రాజీవ్ దీక్షిత్” గారి సమాధానం మన జాతీయ గీతం కేవలం వందేమాతరం మాత్రమే..!!

జనగణమన అస్సలు కాదు… ఆ కీర్తన బానిసత్వానికి ప్రతీక.. అది పాడి మనల్ని మనం అవమానించుకోవద్దు అని అనేవారు..!! సమస్యేంటి??.. చరిత్రలో దాని స్థానం ఎక్కడ??..

ఇదిగో చరిత్ర.

వందేమాతరం గేయాన్ని “బంకించంద్ర చటర్జీ” గారు రాసారు. ఆయన ఈ పాటను రాసిన తర్వాత అది ప్రజల్లోకి రావడానికి 7 సం”లు పట్టింది. ఎందుకంటే ఆయన ఈ పాట కంటే ముందు “ఆనంద్ మఠ్” అనే పేరుతో ఎన్నో ప్రసంగాల(ఉపన్యాస) ప్రతులు రాసారు… ఆ ఉపన్యాసాలకు తోడు ముందు పేజీలో ఏదైనా మంచి జాతీయ గేయం స్ఫూర్తిని కలిగించే విధంగా ఒకటి రాసి ఈ ప్రసంగ ప్రతులతో జత కలిపితే బాగుంటుందని భావించి “వందేమాతరం” గేయం రచించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు క్రాంతి వీరుల ప్రేరణాత్మక ఈ పుస్తకం 7సం” లకు గాని ముద్రణకు నోచుకోలేక పోయింది.

1882 లో రాసిన సదరు ఉపన్యాస ప్రతి..1889 లో ముద్రణకు నోచుకుంది. పుస్తక ముద్రణ జరిగాక “ఆనంద్ మఠ్” పేరుతో ఉన్న ఉపన్యాసాల ప్రతులు, వందేమాతరం పాట కలిసున్న ఈ పుస్తకంలోని విషయాలు… క్రాంతి కారుల సభల్లో భాగం పంచుకొని, వందేమాతరం పాట లోని మొదటి పదం “వందేమాతరం” అనేది కాస్తా స్ఫూర్తినిచ్చే నినాదంగా మారింది. వందేమాతరం పాట యొక్క అర్థం ఆ పుస్తకం లో ” బంకించంద్ర చటర్జీ” గారు పొందు పరచడం జరిగింది.

ఈ “ఆనంద్ మఠ్” పుస్తకం ఆంగ్లేయులనూ, వారికి వంత పాడే భారత దేశంలోని మూర్ఖపు రాజులనూ వ్యతిరేకిస్తూ రాయడం జరిగింది. ఇందులో ఆయన స్వరాజ్యం కాంక్షిస్తూ.. ఆంగ్లేయులకు విరుద్ధంగా పోరాడాల్సిన ఆవశ్యకత గురించీ..వారు చేస్తూ ఉన్న దోపిడీ, అత్యాచారాలు, హత్యలు, మోసాలు, మనం కోల్పోతున్న సంతోషాల గురించి..ఇలా ఎన్నో విషయాలకు సంబంధించి విస్తారంగా వర్ణించడం జరిగింది.

అయితే “బంకించంద్ర చటర్జీ” గారు రాసిన వందేమాతరాన్ని ఒక సారి చదివిన ఆయన కూతురు తన తండ్రితో నాన్న ఈ పాట లోని పదాలు చాలా క్లిష్టంగా ఉన్నాయ్. సరళమైన భాషలో రాయకూడదా?. అని అడిగారు. దానికి సమాధానంగా “బంకించంద్ర చటర్జీ” గారు చూడమ్మా ఈ రోజు నువ్వు క్లిష్టంగా ఉన్నాయి ఈ పద బంధాలు అంటున్నావ్..కానీ ఇదే పాట ఒకరోజు క్రాంతి కారుల నోళ్ళలో నానుతూ, అందరిలో స్పూర్తిని రగిలిస్తుంది అని అన్నారు. తర్వాత ఆయన మాటే నిజమైంది.

అయితే బాధాకరమైన విషయం ఏంటంటే 1882 లో ఈ పుస్తకం రాసి ఇలా తన కూతురితో “వందేమాతరం” పాట భవిష్యత్తులో జనాలను ఏ విధంగా ప్రభావితం చేయగలదో ప్రకటించిన 12సం” రాల తర్వాత 1894 లో 56సం” రాల వయస్సులో ఆయన స్వర్గస్తులవడం జరిగింది.

తర్వాత ఆయన కుటుంబ సభ్యులు, కూతురు అంతా కలిసి ఆయన రాసిన “ఆనంద్ మఠ్” పుస్తకాన్ని పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడం జరిగింది. అయితే పుస్తకం మొదట “బెంగాలీ” భాషలో ప్రచురితమైంది. తర్వాత ఆ పుస్తకం సాధించిన ఆకర్షణ మూలంగా మరాఠీ, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మొదలగు ఎన్నో భారతీయ భాషల్లోకి తర్జుమా చేయడం జరిగింది.

అయితే ఈ పుస్తకం, దాని ప్రభావం గురించి తెలుసుకున్న ఆంగ్లేయుల ప్రభుత్వం దాన్ని నిషేధించడం జరిగింది. ఆ పుస్తకాలన్నింటినీ దొరికినవి దొరికినట్లే చిత్తు చిత్తుగా చింపివేయడం..వాటిని కాల్చి వేయడం చేసేది. కానీ ఎన్ని చేసినా దాని మూల ప్రతి ఎప్పుడూ భధ్రంగానే ఉండింది.

ఇదిలా ఉండగా బెంగాల్ లో ఈ విద్రోహ చర్యలను చూసిన ఆంగ్లేయుల ప్రభుత్వం “కర్జన్” అనే ఆంగ్లేయ అధికారి ద్వారా మొదటి సారిగా మతం ఆధారంగా ఒక ప్రాంతాన్ని విభజించడం జరిగింది. బెంగాల్ నుంచి *పశ్చిమ బెంగాల్* హిందువులకోసం, మరియు “తూర్పు బెంగాల్” ముస్లింల కోసం అని చెప్తూ ప్రజల్ని వేరు పరచి..తరలించడం చేసింది.

అయితే ఈ నిర్ణయంతో ఆగ్రహోద్రక్తులైన క్రాంతి కారులు.. ప్రజలందరితో కలిసి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఆందోళనలకు ఊపిరిలూదడం జరిగింది.

ఈ ఆందోళనను అందరికంటే ముందు ప్రముఖంగా “లాలా లజపతి రాయ్” ప్రారంభించి, ఉత్తర భారతం నుండి నేతృత్వం వహించడం జరిగింది.. అలాగే “బిపిన్ చంద్రపాల్” బెంగాల్, పశ్చిమ భారతం నుండి.. ఇంకా “లోక్ మాన్య బాల గంగాధర్ తిలక్” మధ్య భారతం నుండి ఇలా ప్రముఖులు చాలా మంది ఒక్కో చోటు నుండి దేశంలో చేసే ఆందోళనలకు నేతృత్వం వహించడం జరిగింది.

ఈ ఆందోళనలలో సభ ప్రారంభంలో “వందేమాతరం” పాట, సభలో చివరగా “వందేమాతరం” నినాదం ఎప్పుడూ చేస్తూ ఉండేవారు. ఈ ఆందోళనల్లో క్రాంతి కారులు ప్రజలందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలివ్వడం జరిగింది.. ఇది “స్వదేశీ సామ్రాజ్య స్థాపన” కి సంబంధించిన యుద్ధం కాబట్టి ప్రజలు ఆంగ్లేయుల వస్త్రధారణ చేయకూడదు..వారి వస్తువుల్ని బహిష్కరించాలి.. ఆంగ్లేయులకి సహాయ సహకారాలు ఎవ్వరూ చెయ్యకూడదు. క్షరకులు వారి గడ్డం గీసే blade ఎవ్వరూ వాడొద్దు.. చాకలి వాళ్ళు వాళ్ళ సబ్బులు వాడొద్దు.. మిఠాయీలు తయారు చేయు వారు వారి చక్కెర కొనొద్దు.. పురోహితులు pant, suit…boot వేసుకున్న వారికి పెళ్ళిళ్ళు చేయకూడదు అని అంటూ… ఇలా వారు చాలా రకాల నినాదాలు ఇవ్వడం జరిగింది.. అయితే నినాదాలకనుగుణంగా మిఠాయిలు చేయు వారు అన్నీ స్వదేశీ బెల్లంతో sweet చేయడం, చాకలి వారు పిండి, ఒక రకమైన వేరే యితర natural వస్తువులతో బట్టలుతుక్కోవడం ఇలా అందరూ తమ వంతు సహాయ నిరాకరణ..వస్తు బహిష్కరణ ఉద్యమం చేయడం చేశారు. ఈ ఆందోళనకు “లోక్ మాన్య తిలక్” గారు “స్వదేశీ సామ్రాజ్య స్థాపన” కోసం ఆందోళన అని పేరు పెడితే… దాన్ని ఆంగ్లేయులు ఇది బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళన అని అన్నారు.

అయితే ఈ ఆందోళనల వల్ల EAST INDIA COMPANY యొక్క వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇది చూసిన “ఈస్ట్ ఇండియా company” వారు ఆంగ్లేయులు కలిసి BRITISH GOVT పై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. తత్ఫలితంగా “Bengal partition Act” రద్దవడం జరిగింది.

ఈ ఆందోళన 6 సం” ల పాటు  అంటే 1905 నుండి 1911 వరకు BENGAL DIVISION ACT అనే LAW ని ఉపసంహరించుకునేంత వరకు జరిగింది.

ఇందులో ప్రముఖ పాత్ర “వందేమాతరం” నినాదం పోషించింది. ఆ నినాదం ఒక “మంత్రం”లా పనిచేసింది. ప్రతీ కార్యక్రమం మొదట్లో, చివర్లో “వందేమాతరం” నినాదం మారుమోగిపోయేది.

ఈ ఆందోళనలో “కోటి,20లక్షల(1.2cr)  మంది పాలుపంచుకున్నారు.

ఇలా విజయం సాధించిన క్రాంతి కారులు గమనించింది ఏమిటంటే, ఆంగ్లేయుల మెడలు వంచాలంటే ఇక వీళ్ళ వస్తు బహిష్కారం..సహాయ నిరాకరణే సరైన మార్గం అని తెలుసుకున్నారు.

ఆ తర్వాత ఆంగ్లేయ ప్రభుత్వం “బెంగాల్” పోరాటం..క్రాంతి కారులు ఒత్తిడి మూలంగా ఇక తమ ప్రభుత్వం “బెంగాల్” లో సురక్షితం కాదు అని భావించి, వెంటనే భారత రాజధాని “కోల్ కతా” నుండి నేటి “ఢిల్లీ” కి తరలించడం జరిగింది. అంటే ఢిల్లీ 1911లో మన దేశ రాజధానిగా మారింది.

ఆ తర్వాత ఆంగ్లేయులు భారతీయుల్ని శాంతింప చేద్దామని భావించి 1911 లో “బ్రిటీష్” రాజు “జార్జ్ 5” ని భారతదేశానికి ఆహ్వానించడం జరిగింది.

అయితే “జార్జ్ 5” India కి వచ్చినపుడు ఆయనకు ఘనంగా స్వాగతం పలుకడం కోసం..వందేమాతరం పాట కి సమాంతరం(parallel) గా ఒక పాట రాయించాలని భావించి.. ఆ పాటని “రవీంద్రనాథ్ ఠాగూర్” గారి చేత రాయించారు.

ఆ పాటే “జనగణమన

 ఈ పాటలోని పాదాలకు అర్థం…

“జనగణమన అధినాయక జయహే భారత భాగ్య విధాత”… అంటే అర్థం.. భారతీయ ప్రజల గొప్ప నాయకుడా నీకు జయము జయము… భాగ్య విధాత” అంటే భారతీయుల జీవిత భాగ్యాన్ని లిఖించే వాడా అని… ఇంకా పంజాబ్..సింధ్..గుజరాత్..మరాఠా..బెంగాల్ లాంటి అన్నీ రాజ్యాలతో పాటు.. యమునా.. గంగా లాంటి ఎన్నో గొప్ప భారతీయ నదులు కూడా మీకు స్వాగతం పలుకుతూ.. మీ శుభ ఆశీస్సులను కోరుకుంటూ.. మీ యొక్క విజయ గాథ ను పొగుడుతున్నాయ్.. చివర్లో భారతీయులకు మీరొక Superb hero లాంటి వారు…ఓ రాజా మీకు జయము జయము అంటూ… ఇలాంటి అర్థం కలిగి ఈ పాట సాగుతూ ఉంటుంది..!!

కావాలంటే ఒక సారి ఈ పాట మొత్తం పాడుతూ.. అర్థాన్ని Decode చేసే ప్రయత్నం మీరే చెయ్యండి.

ఇప్పుడు చెప్పండి మిత్రులారా… ఇది మన జాతీయ గీతం ఎలా అవుతుంది??..

దీనర్థం తెలిసాక మీరీ పాట పాడగలరా??..

ఇదిలా ఉండగా “రవీంద్ర నాథ్ ఠాగూర్” గారు ఈ పాట గురించి రాస్తూ “లండన్”లో ICS OFFICER హోదాలో ఉండే తన బావ గారు “సురేంద్ర నాథ్ బెనర్జీ” కి ఒక ఉత్తరం పంపించడం జరిగింది.

ఆ ఉత్తరం లో ఆయన ఇలా రాసారు… జనగణమన పాట ను ఆంగ్లేయ అధికారులు నాపై ఒత్తిడి చేసి నాతో రాయించారు. దయచేసి ఈ పాటను ఏ కార్యాలయంలోనైనా పాడక పోవడమే ఉత్తమం.. ఎందుకంటే ఈ పాటలోని అర్థం అంత మంచిది కాదు. అని రాసారు.. ఇంకా ఇలా అంటూనే ఆయన ఇంకో మాట అన్నారు దయచేసి ఈ పాట గురించిన రహస్యం ప్రస్తుతానికి మన మధ్యే ఉండనివ్వండి.. కానీ నేను చనిపోయిన రోజున మీరు ఈ ఉత్తరాన్ని ప్రజలకు బహిర్గతం చేయండి అని రాసారు.!

వందేమాతరం పాట ను ఢీకొట్టే లా ఇలా parallel song నాచేత రాయించడం చేసారు అని ఆయన ఆ ఉత్తరంలో వివరించారు.

ఎందుకంటే ఆ కాలంలో ఎక్కడ చూసినా “వందేమాతరం” మారుమోగుతూ ఉండేది.

“వందేమాతరం” పాట అంతగా జనాల్లోకి చొచ్చుకు పోవడానికి కారణం “ఖుదిరాం బోస్”… ఈయనను 14 ఏళ్ళ వయసులోనే బ్రిటీష్ వారు ఉరి తీయడం జరిగింది..అలా ఉరికంభం ఎక్కే ముందు “ఖుదిరాం బోస్” వందేమాతరం అంటూ నినదిస్తూ చావడం జరిగింది.. దీనితో “భగత్ సింగ్”, “ఉద్ధమ్ సింగ్”, “అశ్వా గుల్ల” లాంటి ఎందరో క్రాంతి కారులంతా ఒక వేళ తాము కూడా ఉరికంభం ఎక్కాల్సి వస్తే ఇలాగే “వందేమాతరం” అంటూ నినదిస్తూ చావాలి అని నిర్ణయించుకున్నారు.

1911 లో “రవీంద్రనాథ్ ఠాగూర్” గారి కుటుంబ చరిత్ర చూస్తే వీళ్ళ అన్న “అవనీంద్ర నాథ్ బెనర్జీ” కోల్కతా Division కి Director లా పని చేసే వారు. వీళ్ళంతా ఆంగ్లేయుల ప్రభుత్వం లో పని చేస్తూ… East India company” లో ఎన్నో డబ్బులు పెట్టుబడులుగా పెట్టి ఉన్నారు. కాబట్టి వీరి కుటుంబం ఆంగ్లేయులకి విధేయులుగా ఉండేది. కానీ  1919 లో “జలియన్ వాలా బాగ్” హత్యాకాండ చూసిన తర్వాత వీరి కుటుంబానికి ఆంగ్లేయులపై సానుభూతి తగ్గింది.

ఒకసారి 1919 ఘటన తర్వాత “గాంధీ” గారు కూడా “రవీంద్రనాథ్ ఠాగూర్” గారిని కలిసి మీరు ఎలా ఆంగ్లేయులకి ఇంత విధేయులుగా మారారు..మీకు కన్నీళ్ళు రావట్లేదా?.. ఎందుకు వాళ్ళ సంకలు నాకుతారు అని తిట్టడం కూడా జరిగింది. 

ఇక 1941 లో “రవీంద్రనాథ్ ఠాగూర్” గారు చనిపోయారు.. అప్పుడు ఆయన రాసిన ఉత్తరం వాళ్ళ బావగారు అందరి ముందుకు తేవడం జరిగింది.!

(చరిత్ర మజిలీ సాగనీ… 2వ భాగం తరువాత శీర్షికలో)

                          – – విజ్జు రాతలు.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics