Entertainment

​ఈ రోజుల్లో జనాలు, యువకులు ఎంత పిచ్చిగా ఉన్నారో చెప్పాలి అంటే…

By- Mr.vijay ,

పాపం ఒక పత్రికా విలేకరి మహిళ మొన్నటి తెలంగాణా “శాసన సభ” ఎన్నికల్లో… ఈ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పి ఆమె సర్వే చేయడానికి వెళ్తే… ఒక రచ్చబండ దగ్గర, అలాగే హోటళ్ళలో ఉన్న జనాల నాడీ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ…చేస్తూ.. ఒక ముసలాయన  తాత దగ్గరికి వెళ్లి ఈసారి మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు అని అడిగితే., నేను నీకే గుద్దుతా… నా వోట్ నీకే.. పో ఇగ అంటాడు..!
ఇంకొక ముసలోడు నేను ఎవరికి ఓటేస్తే నీకు ఎందుకు??.. నా ఇష్టం నేను ఎవరికైనా ఓటు వేస్తాను అసలు నీకు ఎందుకు??.. అహన్ నీకు ఎందుకు చెప్పు అంటాడు.!

యువకులను అడుగితే వారి వద్ద సరైన సమాధానం ఉండదు.

ఇలా ఉంది ఈ రోజుల్లో యువకులు, జనాల పద్ధతులు.. పరిస్థితులు..!!😢😢

అసలు వాళ్ళకి సర్వే అంటే ఏమిటో కూడా అవగాహన లేకపోవడం… అసలు చెప్పాలంటే ప్రపంచంలో చాలా విషయాల గురించి కనీస పరిజ్ఞానం కూడా లేకపోవడం. నిజంగా బాధాకరం. 😢😢

👉 అలాగే ఈ రోజుల్లో యువకులకి ఎన్నో పిచ్చి ప్రత్యేకతలు ఉన్నప్పటికీ…. అందులో నుండి ఇంకొకటి ఈ యువకులకి ప్రతి వీధిలో ఒక “Youth group” ఉంటది.

👉తాగుబోతు యువకులంతా ఆ గ్రూప్ లో సభ్యులుగా ఉంటారు. వాళ్ళకి ఒక “స్టార్ యూత్” అనీ… “సెక్సీ యూత్” అనీ… లేకపోతే “గ్రామ సింహాల యూత్” అనీ… కొన్ని వీధుల్లో యూత్ కి  “KINGFISHER STRONG YOUTH” అని ఇలా మందుల బ్రాండ్లతో కూడా ఉంటాయండి‌ వాళ్ళ యూత్ పేర్లు.

👉 చాలామంది యువకులకి వాళ్ళ తాతలు, తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చిన ఆస్తి ఉంటుంది.

తరువాత ఆస్తి లేని వాళ్లకు ప్రభుత్వం సబ్సిడీ మీద ఇచ్చే బియ్యం వస్తుంది.

ఆ సబ్సిడీ ఉప్పు, పప్పులు తింటూ… ఆస్తులు ఉన్న యువకులు తమ పెద్దలు సంపాదించిన డబ్బులను వాటి విలువ తెలియక ఖర్చు పెడుతూ… పెద్దగా జీవితం గురించి ఇబ్బంది గానీ…ఆలోచన గానీ లేకుండా.. టీవీలు చూస్తూ… సినిమాలు చూస్తూ… ప్రపంచంలో గానీ, దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ, మన జిల్లాలో గానీ, ఎక్కడ ఏమి జరిగితే మాకెందుకు??.. మాకేమైనా వచ్చేది ఉందా?.. లేక సచ్చేది ఉందా?.. అనుకుంటూ… పెద్దగా బాధ్యతలు లేనట్టు… మంచి-చెడులు తెలియకుండా… ఏమీ పట్టనట్టు ఊర కుక్కల్లా తిరుగుతూ ఉంటారు.

👉ఇంకా చీపురు జుట్టుతో… తొక్కల Hair styleతో… సగం పిరుదుల కిందకు జారిన ప్యాంట్ తో, ఒక చెవికి కమ్మ పోగు, చేతులకి 10 ల సంఖ్యలో రబ్బర్ బ్యాండ్ లు… ఇంకా కొంతమంది చదువుకునే వయసులో గుట్కాలు కూడా తింటూ, ఎడతెరిపిలేని ధూమపానం చేస్తూ… ఒకరి నోటి నుండి ఒకరు మార్చి మార్చి ధూమపానం చేయడం… ఒకే బైక్ పైన ఇద్దరు ముగ్గురు గా వీధుల్లో రాష్ డ్రైవింగ్ చేస్తూ… తిరుగుతూ ఉంటారు.

ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో జనాలు, ముఖ్యంగా యువకులు ధర్మాన్ని విడిచి, మంచిని మరిచి, పద్ధతులు పక్కనపెట్టి, మాట కి ముందు ఒక బూతు… మాట కి తర్వాత ఒక బూతు మాట్లాడే బూతు పురాణం సరే సరి.

ప్రపంచం ఇలా ఎందుకు ఉంది??..

ఇంత అభివృద్ధి ఎలా సాధ్యపడింది??..

అసలు ఈ జీవితం ఏంటి??..

ఏదైనా సాధించి చూపించాలి… నేనేంటో నిరూపించుకోవాలి.

మన జీవిత పరమార్ధం ఏమిటి??.. మన జీవితం ఏమిటి??..

ఇలాంటి ఆలోచన గానీ, జిజ్నాస గానీ యువకులకి 100లో 95 మందికి అసలు ఎప్పుడు రాకపోవడం అనేది చాలా శోకించ దగిన విషయం..!!

👉 ఇలాంటి ఈ దారి తప్పిన జనాలకు… యువతకి ఎన్నికలప్పుడు స్థానిక పార్టీ నాయకులు వచ్చి భుజం మీద చేయి వేసి, రెండు మంచి మాటలు చెప్పి, మీకు ఆడుకోవడానికి ఇదిగో స్పోర్ట్స్ కిట్స్ ఇస్తున్నాం.. ఇదిగో మీకు ఫుల్ బాటిల్ లు ఇస్తున్నాం.. ఇదిగో ఈ లక్ష రూపాయలు మీ యూత్ స్టార్ గ్రూప్ వాళ్లు పంచుకోండి… అంటూ చెప్పి వాళ్లను ప్రలోభ పెట్టి., ఈసారి మీరంతా మా పార్టీకే ఓటు వెయ్యాలి.!

అలాగే మీ పెద్ద వాళ్ళని కూడా మాకు ఓటు వేసేలా ఒప్పించి, ఓటు వేయించి, గెలిపిస్తే మీకు మున్ముందు ఇంకా చాలా రకాలుగా సహాయం చేస్తాము. అంటూ దొంగలు, దోపిడీదారులు, నీచులు… ప్రపంచం తెలియని జనాలను మచ్చిక చేసుకొని అధికారాన్ని సంపాదించుకొని… పెద్ద నాయకులై దోపిడీదారులు రాజ్యమేలడం చేస్తారు.

👉ఇక ఆ నాయకుడు భావితరాలకు కలిగించే నష్టం గానీ… కష్టాన్ని గానీ ఏ యెధవా పట్టించుకోడు.

ఇంకా తర్వాత ఆ స్థానిక నాయకుడు పంచిన డబ్బుని అందరూ కొన్ని రోజుల్లోనే తాగి తందనాలాడి ఖర్చు పెట్టేస్తారు కూడా ఈ హౌలే గాళ్ళు.
👉ఇక ఆయా పార్టీలకు సంబంధించిన భజన మీడియా…

👉అలాగే (యూరోప్ ఖండ దేశాలు, అమెరికా లాంటి జిత్తులమారి దేశాలు) తమ తమ దేశాల ఆర్థిక ప్రయోజనాలకు సహాయం చేసే పార్టీలను గొప్పగా చూపించే ఇంటర్నేషనల్ మీడియా కూడా ఉండనే ఉంది. ఇక అవి చేసే ప్రచారాన్ని స్థానిక యువకులు నిజమే అని నమ్మడం వారికే ఓటు వేయడం చివరగా దొంగ నా కొడుకులు దొరలైపోతారు. అందిన కాడల్లా దోచుకుంటూ పోతారు.

👉ఇక అంతే.. దొంగలు రాజ్యమేలాక ఏముంటుంది?. భావి భవిష్యత్తు ప్రశ్నార్థకమే.!😥

👉ఇది నా భారతదేశంలో జరిగే పరిస్థితి.

యువకులకు ప్రపంచం గురించి గానీ…  దేశం గురించి గానీ… అలాగే దేశాల సంబంధిత పూర్వం… ప్రస్తుతం గురించిన చరిత్ర, విజ్ఞానం యొక్క అనుభవం లేకపోవడం వల్ల… దేశ యువకుల అజ్ఞానం… అవిజ్ఞానం… మూర్ఖత్వంతో…

దేశంలో పారదర్శక, జవాబుదారీ పాలనా వ్యవస్థ ఏర్పడడం… దేశ సేవ కై పాటుపడే మంచి వ్యక్తులు అధికారంలోకి రావడం అనేది ఎప్పటికీ కలగానే… దేశానికి ఉన్న సమస్యలు సమస్యలుగానే ఉండిపోతాయి..!!

👉ఎవడు ఏది చెప్పినా నిజమని నమ్మే యువకులు… ఏవైనా పనులు చేసి సొంతంగా డబ్బు సంపాదించలేని బద్ధకస్తులు… స్వార్థంతో తిరిగే యువకులు… సంపాదించిన డబ్బుని సరియైన రీతిలో ఖర్చు పెట్టేలాంటి money management గురించి తెలియని యువకులు ఉన్నంతకాలం ఈ దేశానికి ఉన్న సమస్యలు రూపుమాపడం… దరిద్రం తొలగడం… దేశం అభివృద్ధి చెందడం.. అనేది కొంచెం సమస్యాత్మకమైన… లోతుగా ఆలోచన చేయాల్సిన విషయమే.!!

                           – విజ్జు రాతలు.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics