Competitive

​దివంగత జార్జ్ ఫెర్నాండిజ్ గురించి దయచేసి చదవండి

ఆ తండ్రి తన కొడుకును చర్చిక్ ఫాదర్ గానో ధర్మగురువుగానో చేయాలని ఆశపడ్డాడు.

ఇష్టం కాలేదు కొడుకుకు.

ఈ దేశపు మట్టి గుణం చూడండి.

కొడుకు తనకు ఉపదేశం చేసే వాళ్ళనే ప్రశ్నించడం మొదలుపెట్టాడు.

ఆ మతంలో ఆచారాల్లో చెప్పేదొకటి చేసేదొకటి అని ధృడపరచుకున్నాడు.

ఎట్టిపరిస్త్తితుల్లోనూ మనసుకు నచ్చని పని చేయనేకూడదని నిశ్చయించుకున్నాడు.
అతడడిగే ప్రశ్నలకు ధర్మగురువులు ఉత్తరం ఇవ్వలేకపోయేవారు. 

తండ్రికి ఫిర్యాదు చేశారు కొడుకుమీద.

తండ్ర్రికి కోపం వచ్చి ఇంటినుండి వెలేశాడు.

అనుమానాలు, ప్రశ్నలు సహజమైన సమాజవాదియొక్క మూల గుణాలు.

అతడు జార్జ్ ఫెర్నాండెజ్..

జార్జ్  ఏమాత్రం బెదరలేదు.. 

ఒకరివద్ద చిన్నపనికి చేరుకున్నాడు. 

అక్కణ్ణుండి ముంబై వెళ్ళి కార్మిక నాయకుడైన డిమెల్లో అనే వ్యక్తివద్దకు చేరాడు.

అక్కడే ఉండే సోషలిస్ట్ పార్టీ కచేరీ బెంచీమీద పడుకునేవాడు.

కడుపారా రొట్టెముక్కకూ కష్టమయ్యేది. 

ముంబై ఫుట్ పాత్ పై కూడా చాలా రాత్రులు గడపాల్సివచ్చింది. 

అంత కష్టం.. ఆ స్థలానికీ రోజూ కొట్లాటలు.. రౌడీలతో తొందర. ఒకరాత్రి నిద్రపోవడానికి పావలా సుంకంగా ఇచ్చుకోవాల్సివచ్చేది.

ఒక్కోసారి జీవితం లో మలుపులు.. కష్టాలు మనిషిని ఉన్నతస్థితికి తీసుకుపోతాయి.

చూస్తూండగానే జార్జ్ కార్మికనాయకుడై ఎదిగాడు. 

అకస్మాత్తుగా అతడు కాంగ్రెస్ లో ప్రభావంతమైన నాయకుడిగా వెలుగుతున్న ఎస్. కె. పాటిల్ అనే వ్యక్తిపై ఎన్నికల్లో నిలవాల్సిన సందర్భం వచ్చింది.

ఎస్.కె.పాటిల్ అనే వ్యక్తికి ఎంత అహంకారం అంటే  “నన్ను ఓడించడం ఆ దేవుడితరమూ కాదు” అనేంతగా.

ఆ అహంకారం పేదప్రజల ఆరాధ్యదేవత అని చిత్రింపబడిన, ప్రజలకుండే మూర్ఖ , మూఢ అనండి అభిమానం పొందిన ఇందిరాగాంధీ  వల్ల వచ్చింది. దీనికి నెహ్రూ గాంధీ ల ఫోటోలూ తోడవడంతో కాంగ్రెస్ నాయకుల అహంకారం పేద ప్రజలతో ఆడుకునేలా చేసేది.

జార్జ్ బుద్ధివంతుడు.

కరపత్రాలు ముద్రించాడు. తనే స్వయం ప్రతి ఓటరువద్దకూ వెళ్ళి పంచి చెప్పసాగాడు

“సోదరులారా.. నిజం.. దేవుడిని ఓడించడం ఎవ్వరితరమూ కాదు. అయితే అహంకారంతో ఉన్న ఎస్.కె.పాటిల్ ను ఓడించడం కష్టం కాదుకదా.. ఆలోచించండి” 

ఓటరు మహాశయుడు కరుణించాడు.. ఓట్లవర్షం కురిపించాడు.

అహంకారులైన కాంగ్రెస్ నాయకులేకాదు ఇందిగాగాంధీ కనుబొమలు పైకెగిసేలా చేశాడు.

=====

1975లో ఎమర్జెన్సీ వచ్చింది.. 

ఉన్న కోపం.పగ చల్లార్చుకోడానికి జార్జ్ ను చేతులకు సంకెళ్ళు వేసి జైలులో పెట్టారు.

ప్రజాపక్ష నాయకుడుకదా.. అదరలేదు బెదరలేదు. జైలునుండే ఎన్నికల్లో పోటీ  చేశాడు జార్జ్.

జార్జ్ కు అతడి తల్లి ప్రోత్సాహం అందించి ప్రజల్లో ప్రచారం చేసింది.

ఆ గెలుపు భవ్యమైనది. ఇందిరాగాంధీ కీ భయపడేలా చేసింది. అంత గొప్ప గెలుపది.

ఇందిరాగాంధి హయాం లో దేశం మొత్తం గుత్తాధిపత్యంలో ఉండేది.

మీడియా సంస్థలు అధికారపక్షం ఏం చెబితే అదే రాసే పరిస్థితి. రేడియో గురించి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు.

అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పై వ్యతిరేకతను వ్యక్తపరుస్తూ జార్జ్ భారత్ బంద్ పిలుపిచ్చాడు.

రైల్వేలతో సహా దేశం మొత్తం ఒకరోజుపాటు సంపూర్ణ బంద్ ఆచరించింది. అదీ జార్జ్ పై ప్రజలకున్న గౌరవం..నమ్మకం. ఆయనకున్న బలం.

మొరార్జీదేశాయి అధికారం లో ఉండగా కేంద్ర సమాచార శాఖ మంత్రయ్యాడు.

తర్వాత ఉద్యోగశాఖ మంత్రి అయ్యాడు.

ప్రపంచం మొత్తం కాంగ్రెస్ చెట్టులా ప్రాకిన కోకాకోలా కంపెనీ పానీయాలవల్ల ఆరోగ్యానికి హాని అని తెలిపి ప్రపంచపు ఒత్తిళ్ళలోనూ కోకాకోలా ను దేశం నుండి బ్యాన్ చేసేశాడు.

జార్జ్ ధీరుడు.. వీరుడు. ఏవిధమైన విదేశీ ఒత్తిళ్ళకూ లంచాలకూ లొంగలేదు.

ముందు జనతాపార్టీ ముక్కలవడంతో లాలూ ప్రసాద్ యాదవ్ జతలో చేరాడు. అప్పట్లో లాలూకు మంచి ప్రజాబలం.. (ఇప్పటికీ ఉన్నది.. అది వేరే రకంగా.. అది వేరే విషయం)

యాదవకులానికి చెందిన లాలూ కులరాజకీయాలు చేస్తుంటే తట్టుకోలేక జార్జ్ బయటికొచ్చేశాడు. 

స్వంతంగా సమతాపార్టీ స్థాపించాడు. జార్జ్ తో నితీష్ కుమార్ జతకలిశాడు.

బిహార్ లో సమతాపార్టీ వేళ్ళూనుకుంది. అదే ఇప్పుడు జెడియు గా పేరు మార్చుకుంది.

====

ముందు అటల్ బిహారీ వాజపేయి జతకలిశాడు.

అటల్ జార్జ్ పై పూర్తి నమ్మకంతో రక్షణశాఖను అప్పగించి మంత్రిని చేశాడు.

భారతదేశం అంటే ఏమిటో ప్రపంచానికి తొలిసారి చెప్పిన త్రిమూర్తులు అటల్, జార్జ్ మరియు అబ్దుల్ కలాం.

ఫోక్రాన్ అణుబాంబ్ ప్రయోగం, కార్గిల్ యుద్ధాన్ని సమర్థవంతంగా నియంత్రించగలిగారు.

కార్గిల్ యుద్ధరంగానికే వెళ్ళారు జార్జ్. సైనికులు పడే కష్టాన్ని కళ్ళారాచూసి చలించిపోయారు.

సైనికులు హిమాలయాల్లో సంచరించడానికి సరైన బూట్లు ఇవ్వలేని కాంగ్రెస్ పై రగిలిపోయారు. 

బులెట్ ప్రూఫ్ జాకెట్ అవశ్యకత ఉండింది. వెంటనే అక్కడి అందరు సైనికులకూ ఈ వసతులు కల్పించాడు.. అదీ సమర్థత అంటే.

జార్జ్ ఫెర్నాండెజ్ మార్గదర్శనంలో మన సైన్యం పాకిస్తాన్ సైనికుల్ని మట్టికరిపించి తోకముడిచేలా చేసింది. 

యుద్ధం లో వీరమరణం పొందిన సైనికులను వారి ఇళ్ళ స్థలాలకు పంపే ఏర్పాట్లు చేయబోగా శవపేటికల అవసరం వచ్చేది. 

తక్షణం విదేశాలనుండి శవపేటికలను తెప్పించి వీరసైనికులను వారి ఇళ్ళకు గౌరవంగా పంపించేవారు.

ఇక్కడ విషయం వేరొకటి.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ శవపేటికల్లో అక్రమాలు జరిగాయని అందులో జార్జ్ ఫెర్నాండెజ్ హస్తముందని ఆరోపణలు చేసింది. 

“జార్జ్ లంచం తిన్నాడు.. దేశానికి మోసం చేశాడు. క్షమాపణ చెప్పాలి… శవపేటికల కుంభకోణంపై దర్యాప్తు చేయాలి” ఇదీ కాంగ్రెస్ మూర్ఖపు వాదన.(ఇప్పుడు రాఫెల్ యుద్ధ విమానాల చేస్తున్నారు గా అలా)

పచ్చ కామెర్లు వచ్చిన రోగికి లోకం పచ్చగానే కనబడుతుందట. 

బలహీనమైన సంకీర్ణప్రభుత్వంలో చిన్నచిన్న లుకలుకలు.. దేశం మొత్తమ్ కాంగ్రెస్ పార్టీ మీడీయాద్వారా శవపేటికల స్కాం అంటూ హల్ చల్ చేసింది. 

పాపం జార్జ్ ఫెర్నాండెజ్.. 

ఆయనకు కనీసం బ్యాంక్ అకౌంట్ లేదు. 

రెండు గదుల ఇల్లు. ఒకే ఒక స్యూట్ కేస్ అందులో ఒక జుబ్బా, పైజమా సెట్టు, టూత్ బ్రష్, పేస్టు. 

వీటితోపాటు ఒక జత హవాయి చెప్పులు. 

వేసుకున్న జుబ్బా పక్క జేబులో ఒక్క పైసా కూడా ఉండేదికాదు. ఎందరెన్ని చెప్పినా వారించేవారు.

ఎక్కడికైనా సభలకు సమావేశాలకు వెళ్ళడానికి టికెట్లను పార్టీ సమకూర్చేది. హోటల్ లో కూడా భోజన వసతి పార్టీనే చేయాలి. పొరబాటున రోజువారీ భోజనం రాకుంటే జార్జ్ ఉపవాసం చేసేవారేగానీ ఎవ్వరికీ కనీసం విషయం చెప్పేవారే కారు.

ఇటువంటివ్యక్తి వీరమరణం పొందిన సైనికుల వెల కట్టలేని దేహాలను వారి కుటుంబాలకు సాగించేందుకు అవసరమయ్యే శవపేటికలకోసం లంచం తీసుకుంటారా. పార్టీల పైశాచిక రాజకీయనృత్యానికి కుంగిపోయాడు.

కళ్ళల్లో నీరు ధారలా కారడం లేదూ…

జార్జ్ ఫెర్నాండెజ్ అనుకునుంటే ఎంత డబ్బు, ఆస్తి సంపాదించేవారు? గ్రామం లోని సర్పంచ్ కూడా కోట్లకు పడగలెత్తుతాడు.. ఓ సామాన్య ప్రభుత్వాధికారి తరతరాలు కూర్చుని తినేలా సంపాదిస్తాడు. అటువంటిది జార్జ్ ఎందుకు పార్టీలతో నిందలు పడాల్సి వచ్చింది? నిజంగా డబ్బు తిని ఉంటే ఈ నింద అసలు పడేదా?

అత్యంత సరళమైన, సౌమ్యగుణం, వ్యక్తిత్వాన్ని పొందిన జార్జ్ ఫెర్నాండెజ్ గారిని తలచుకుంటేనే కన్నీళ్ళు ఆగవు.

ఇటువంటి మహనీయుణ్ణి రాజకీయం కోసం వాడుకుంది కాంగ్రెస్ పార్టీ.

======

కర్ణాటకలోని మంగళూరులో పుట్టి, మహారాష్ట్రలో పెరిగి బిహార్ రాష్ట్రం లో రాజకీయ జీవితం కొనసాగించి.. డిల్లీనుండి దేశం మొత్తం గర్వపడేలా అనేక నిర్ణయాలు చేసిన జార్జ్ ఫెర్నాండెజ్ కాంగ్రెస్ నిందలకు కుంగిపోయారు..

రాజకీయాలు ఇక చాలు అనుకునేంతలోనే అల్జీమర్స్ అనే మరుపు వ్యాధిన పడ్డారు.. 

మంచిదే.. తనకు జరిగిన అవమానలను మరవడమే ఆయనకు చివరన మంచానపడినా… ఏమీ ఇవ్వని దేశం కనీసం చివరన మరచిపోయే వ్యాధిని ప్రసాదించి ప్రశాంతంగా చిన్న గదిలో గడిపేలా చేసింది. 

తండ్రికి ఇష్టం కాలేదు. పార్టీకి ఇష్టం కాలేదు.. చివరన కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు నిందలతో చాలామంది అభిమానులనూ దూరం చేసుకున్నారు.. 

అయితే ఆ వ్యక్తిత్వం తెలిసిన నాలాంటి వ్యక్తులకు ఆయనెప్పుడూ గొప్ప నాయకుడే.. మహనీయుడే.

29.01.2019న తన ఇంటి చిన్న గదిలోనే వయసురీత్యా వచ్చిన వ్యాధులు, స్వైన్ ఫ్లూ వ్యాధిసోకడం తో… చాలు చాలికచాలని తమ 88వ ఏట తుది శ్వాస విడిచారు.. జార్జ్ ఫెర్నాండెజ్. 

సర్. నేను సామాన్యుణ్ణి. మీకేదైనా సేవచేద్దామన్నా స్వీకరించని ఉన్నత మనస్తత్వంతో జీవించారు మీరు.. నా కంట్లోంచి రాలే చిన్న చిన్న కన్నీటిబొట్లే మీకు నేఇచ్చే నివాళి.. 

స్యాల్యూట్ సర్. జార్జ్ ఫెర్నాండెజ్ సర్. అటల్ బిహారీ వాజపేయి, అబ్దుల్ కలాం మరియు మీరు ముగ్గురూ త్రిమూర్తులు

అమర్.. అక్బర్.. ఆంథోని..లు సర్ మీరు..

మళ్ళీ మీరు ముగ్గురూ ఒకేరోజు మనదేశంలోనే పుట్టాలి. మీకు మరో జన్మలోనైనా ఈదేశం తగిన గౌరవం ఇస్తుంది.. నా దేశం మహోన్నత భారతదేశం.. 

జై భారత్. జైజై భారత్.

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics