NEWS

(AECT) విషయంలో జరిగే వ్యవహారం అనేక అనుమానాలు కలుగజేస్తుంది.- legal rights protection forum.

ఫారిన్ కంట్రిబ్యుషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం.. ఒక సంస్థకు ఏ అవసరం కోసమైతే విదేశాల నుండి(లేదా విదేశీ సంస్థల నుండి) ఫండ్స్ వస్తాయో ఆ అవసరం కోసం మాత్రమే ఆ ధనాన్ని ఖర్చు చేయాలి. 
ఇక్కడ Anderson Educational & Charitable Trust (AECT) విషయంలో జరిగే వ్యవహారం అనేక అనుమానాలు కలుగజేస్తుంది. ఈ సంస్థ 1994లో చెన్నైలో trustగా రిజిస్టర్ అయింది. FCRA లైసెన్స్ కూడా సంపాదించింది. విదేశాల నుండి ఈ సంస్థకు ఫండ్స్ పంపే ఏకైక సంస్థ India Gospel League (IGL). విచిత్రంగా ఆ సంస్థ కూడా 1994లోనే అమెరికాలో రిజిస్టర్ అయింది. అప్పటి నుండీ IGL సంస్థ AECTకి విరాళాలు ఇస్తూనే వస్తోంది. 

మొన్న ఏదో సెర్చ్ చేస్తుంటే AECT విషయం కాస్త అనుమానస్పదంగా అనిపించి లోతుగా పరిశీలించాం. 

fcraonline.nic.in వెబ్సైట్లో FC లైసెన్సులు ఉన్న అన్ని సంస్థల వివరాలు ఉంటాయి. ఆ సంస్థలకు వచ్చే విదేశీ విరాళాలు, ఏ ఉద్దేశం కోసం ఆ విరాళం వస్తోందో అన్ని వివరాలు ఉంటాయి. AECT కి IGL ఇస్తున్న విరాళం యొక్క ఉద్దేశం “Education”. అంటే పిల్లలకు చదువు నిమిత్తం విరాళం ఇస్తున్నట్టుగా వారు ఫైల్ చేసిన FCRA రిటర్న్స్ లో పేర్కొన్నారు. కానీ INDIA GOSPEL LEAGUE ఒక మతమార్పిడి సంస్థ. ఎడ్యుకేషన్ సెక్టారుకి ఏమాత్రం సంబంధం లేని సంస్థ. 

IGL సంస్థ వెబ్సైట్ (www.iglworld.org) భారతదేశంలో access చేయలేము. ఇక్కడే బయటపడింది దాని వ్యవహారం. Virtual Private Network ద్వారా US సర్వర్ కి కనెక్ట్ అయ్యి ఆ వెబ్సైట్ access చేశాం. అందులో ఆ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశాలన్నీ బయటపడ్డాయి. కేవలం భారతదేశంలో చర్చి స్థాపన, పాస్టర్లకు ట్రైనింగ్ వంటివి వాళ్ళ activities. 
మన దేశీ సంస్థల వివరాలు ఏ విధంగా మన ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఉంటాయో, అమెరికన్ సంస్థల వివరాలు కూడా అక్కడి అమెరికన్ అధికారిక వెబ్సైట్లో ఉంటాయన్నది చిన్న లాజిక్. ఈ లాజిక్ ప్రకారం అమెరికన్ ప్రభుత్వ వెబ్సైట్లో IGL వివరాలు చెక్ చేశాం. దాని Income Tax వివరాలలో.. ఖమ్మంలో పాస్టర్లకు బైబిల్ ట్రైనింగ్ నుండి భారతదేశంలో చర్చిల ఏర్పాటు కోసం ఇచ్చిన లక్షలాది డాలర్ల వివరాలు బయటపడ్డాయి. 

వాటి ఆధారాలతో AECT కి కేటాయించిన FCRA లైసెన్స్ రద్దు చేయాల్సిందిగా హోంశాఖ ఆధ్వర్యంలోని FCRA Wing కి ఫిర్యాదు చేస్తున్నాం..అంటున్న శ్రీ సంతోష్ A S. Legal rights protection forum. 
Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics

Subscribe via Email

Enter your email address to subscribe to this NEWS portal and receive notifications of new posts by email.

Join 542 other subscribers

Any one can Send Us NEWS -Publish@mydigitalnews.in ,santhosh@mydigitalnews.in , 888 5555 924 Whatsapp Dismiss