Celebrities

​రిల్ హీరో కదూ సర్ మీరు రియల్ హీరో. – Akshay ji.

 103 మంది అమర జవాన్ల కుటుంబాలకి రూ.25,000 చొప్పున 25,75,000 సాయం చేసిన అక్షయ్ కుమార్ సమాజ శ్రేయ‌స్సు కోసం ఎంతో కొంత పాటుప‌డాల‌నే త‌ప‌న ఉన్న స‌ద‌రు హీరో అక్షయ్ కుమార్ .. గతంలో చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకి ఆర్థిక సాయం ప్రకటించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న మ‌రో గొప్ప ప‌ని చేసి అందితోనూ శ‌భాష్ అనిపించుకుంటున్నారు. మహారాష్ట్ర కొల్లాపూర్ రేంజ్ స్పెషల్ ఐజీ విశ్వాస్ నంగరె పాటిల్ 103 మంది అమర జవాన్ల కుటుంబాలకి స్వీట్లు పంచారు. విశ్వాస్ నంగరె పాటిల్ చేస్తోన్న కార్య‌క్ర‌మాన్ని గురించి తెలుసుకున్న అక్ష‌య్ కుమార్‌.. ఈ సంద‌ర్భంగా తాను ఆ 103 మంది అమర జవాన్ల కుటుంబాలకి కూడా ఆర్థిక సాయం అందిస్తాన‌ని ప్ర‌క‌టించారు. అమ‌ర జ‌వాన్ల పిల్లలకు నోట్ బుక్స్ తోపాటు రూ.25,000 చొప్పున ఇస్తాన‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా వారికి ఓ లేఖను కూడా పంపిస్తూ.. ప్రాణ త్యాగం చేసిన జ‌వాన్ల‌ని చూసి దేశం గర్విస్తోందని అన్నారు. 

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics