NEWS

వైఎస్ ఆర్ సి పి  అభ్యర్థి నంబూరు శంకర్ రావు నామినేషన్

పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్ ఆర్ సి పి  శాసన సభ అభ్యర్థిగా నంబూరు శంకర్ రావు స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో నంబూరు శంకర్ రావు మద్దతుగా నాయకులు కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేశారు.
నంబూరు శంకర్ రావు మాట్లాడుతూ : నాకు ఈ అవకాశం కల్పించిన వైఎస్ ఆర్ సి పి అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతులు  ఈ ఐదు సంవత్సరాలలో  నియోజకవర్గలో అవినీతి ఎక్కువ అయింది రోడ్ల పరిస్థితి  అధ్వాన్నంగా తయారు అయ్యాయి అదేవిధంగా  అక్రమ ఇసుక వల్ల వచ్చిన డబ్బుతో ఓట్లు కోనాలి అని చూస్తున్నారు . మా ప్రభుత్వం వస్తే మండలానికి ఒకరిని ఇన్చార్జీలాను ఏర్పాటు చేసి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటు సేవలు అందిస్తాను అని తెలిపారు. 
వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా రాయపాటి సాంబశివరావు ఎంపీగా వుంటు కనీసం ఐదు సార్లు కూడా ప్రజలకు చేరువగా లేరని ఏడు నియోజకవర్గాలలో ఎటువంటి అభివృధి జరగలేదని అన్నారు. ఈ సారి మా పార్టీ అధికారంలోకి వస్తుంది .ప్రజల కష్టాలు తొలుగుతాయి అన్నారు.

Mr.Suri MDN NEWS 

ACHAMPET 

Please emails us for updates and corrections publish@mydigitalnews.in 

Topics

Subscribe via Email

Enter your email address to subscribe to this NEWS portal and receive notifications of new posts by email.

Join 546 other subscribers