NEWS

మేము పగిలిన పలకలను మార్చాము – మీరు పగిలిన పైకప్పును …

తెనాలి :- స్థానిక కొలకలూరు : ఈరోజు 7 -8-2019 , తెనాలి మండలం కొలకలూరు గ్రామం లో ఉన్నటువంటి (12 ) అంగన్వాడీ కేంద్రాలలో చదువుతున్న టువంటి చిన్నపిల్లలకు ,స్థానిక యువత(IASF ) చిరు తినుబండారములు , పలకలు పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా యువత మీడియా తో మాట్లాడుతూ , మేము తిరిగినటువంటి అంగన్వాడీ కేంద్రాలలో వసతులు , మరియు భవన సముదాయములు , సరిగ్గా లేకపోవడం, పై కప్పు పగిలి పెచ్చులు రాలుతున్న స్థితి లో ఉండటం వలన చిన్న పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది కావున దీనికి ప్రభుత్వం వారు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుని బాగు చేయాలని కోరుతున్నాం ,

మా కమిటీ సభ్యులందరూ కలిసి అంగన్వాడీ కేంద్రాల యొక్క ఇన్చార్జిల తో మాట్లాడి వారికి ఉన్న ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సూచనా ప్రాయంగా చెప్పటం జరిగింది, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సదరు అధికారులకు , మా కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

Please email us for updates and corrections – Publish@mydigitalnews.in

Topics