వినాయక వ్రతం చేయండి ఇలా మీకు సకల సిరిసంపదలు ,అష్టైశ్వర్యాలు లభిస్తాయి

ఇలా వినాయక వ్రతం చేయండి మీకు సకల సిరిసంపదలు ,అష్టైశ్వర్యాలు లభిస్తాయి . వ్రత విధానం మరియు మంత్రములు ఉన్న వి .

Aug 20, 2020 - 03:29
Sep 10, 2021 - 11:12
 0
వినాయక వ్రతం  చేయండి ఇలా మీకు  సకల సిరిసంపదలు ,అష్టైశ్వర్యాలు లభిస్తాయి

వినాయకచవితి - గణేష్ చతుర్థి 

 గణాలకు అధిపతి అయిన వినాయకుడి పండుగ వస్తే చాలు... ఇక పండుగలు మొదలైనట్లే అంటారు పెద్దలు . ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేయడం సంప్రదాయం. అలాంటిది...

స్వయంగా వినాయకుడి పండగే వస్తే... ఇక భక్తకోటికి అంతకంటే ఆనందం ఏముంటుంది.  పిల్లల నుంచి ముసలివారి వరకూ... అందరూ ఈ పండుగలో పాల్గొని సకల శుభాలూ కలిగించమని ఆ బొజ్జ గణపయ్యను ప్రార్థిస్తారు. భారతదేశంలో... గణేశ్ చతుర్థిని ప్రపంచమే ఆశ్చర్యపోయే రేంజ్‌లో మహారాష్ట్రలో నిర్వహిస్తారు. ఆ తర్వాత... అదే స్థాయిలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఇక గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో కూడా ఈ పండుగను అత్యంత బాగా నిర్వహిస్తారు.

ప్రత్యేకించి వినాయకుడి మట్టి ప్రతిమను పూజ గదిలో ఏర్పాటు చేసి... పూలు, పండ్లతో అలంకరించి... నవరాత్రి పూజలు చేయడం గణేశ్ చతుర్థి నుంచి మొదలవుతుంది. ఆ తొమ్మిది రోజులు... భక్తి గీతాలు ఆలపిస్తూ... భజనలు చేస్తూ.

భక్తిభావంలో మునిగితేలుతారు ప్రజలు. అఖండ దీపం వెలిగించి... ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పూజలు మూడ్రోజులు, ఐదు రోజులు, 9 రోజులు, 14 రోజులు ఇలా ఎవరి తాహతును బట్టీ వారు జరుపుకుంటారు. ఇక అనంత చతుర్దశి నాడు... గణపతిని సాగనంపుతూ... శోభాయాత్రలు చేస్తారు. అలా పంపిస్తూనే... మళ్లీ వచ్చే ఏడాది రావయ్యా బొజ్జ గణపయ్యా అంటూ... గణపతి పప్పా మోరియా అంటూ... హోరెత్తిస్తారు.

 

  ఈ పండుగ చిన్న పిల్లలు చాల ఇష్టంగా జరుపుకుంటారు .వారు తమపుస్తకాలు ,బట్టలు పనిముట్లు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు చాల ఇష్టంగా చేస్తారు . 

వినాయక చవితి వ్రత కథ, పూజా విధానం

 వినాయక చవితి రోజున ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికి వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించాలి . ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరువత్తులు వెలిగించి, దీపారాధన తర్వాత ఈ కింది మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ పూజను ప్రారంభించాలి.

ఓం దేవీంవాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపా: పశవో వదంతి ! సానో మంద్రేష మూర్జం దుహానా ! ధే నుర్వాగాస్మానుప సుష్టుతైత్తు !అయం ముహూర్తస్సుముహూర్తోస్తు.!.

శ్లోకం: య శ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వ మంగళా తయో స్సంస్మరణా త్సుంసాం సర్వతో జయమంగళం అని చదవాలి. పీటపై వినాయక ప్రతిమను ఉంచి, పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు, పళ్లతో అలంకరించాలి. ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకులు, జిల్లెడుకాయలు మొదలైన పిండివంటలు సిద్దం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి, అందులో నీళ్లువేసి, పైన టెంకాయ, జాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి.

పూజకు కావాల్సిన సామాగ్రి

పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, తోరం, కుందులు, నెయ్యి, నూనె, వత్తలు, 21 రకాల పత్రి, ఉద్దరిణ, నైవేద్యాలు.

 పూజా విధానం..

 ఓం కేశవాయ స్వాహాః, ఓం నారాయణాయ స్వాహాః, ఓం మాధవాయ స్వాహాః అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని ఆచమనం చేసుకోవాలి. అనంతరం

ఈ కింది శ్లోకాలను ఉచ్చరించాలి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

 ఈ కింది మంత్రాన్ని చెబుతూ కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లాలి.

ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీపురందరాభ్యాం నమః, ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః, ఓం శ్రీ సితారామాభ్యాం నమః, నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు

 భూతోచ్చాటన

ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే మంత్రాన్ని చదువుతూ అక్షతలు తలపై నుంచి వెనుక వేసుకొవాలి.

 ప్రాణాయామం: ఓం భూః, ఓం భువః, ఓగ్ సువః, ఓం మహాః, ఓం జనః, ఓం తపః, ఓగ్ సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్|, |ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్ .... అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః అని నాలుగు దిక్కులా ఉద్ధరనితో నీళ్లు చల్లి శుద్ధిచేయాలి.

 సంకల్పం:

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, …….. నదీ సమీపే……… ( శ్రీ శైలస్య) నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ…………….నామ సంవత్సరే, …………… (దక్షిణాయనే), …….. (వర్ష) ఋతౌ, ……… (భాద్రపద) మాసే, ……… (శుక్ల) పక్షే,..….. (చతుర్థ్యాం) తిథి ………………. వాసరే, శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం, శుభతిధౌ శ్రీమాన్………… గోత్ర: ……….నామధేయ: ధర్మపత్నీ……………… సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే అంటూ కుడిచేయి ఉంగరం వేలితో నీళ్లు ముట్టుకోవాలి. 

భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే ....

ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవమ్ ధ్యాయేత్సిద్ధి వినాయకమ్

ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం

 షోడశోపచార పూజ

ధ్యాయేత్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం.

శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి

 అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ

ఆవాహయామి: మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం.

ఆసనం సమర్పయామి: గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం.

ఆర్ఘ్యం సమర్పయామి: గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన.

పాద్యం సమర్పయామి: అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో.

ఆచమనీయం సమర్పయామి: దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే.

మధుపర్కం సమర్పయామి: స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత.

పంచామృత స్నానం సమర్పయామి: గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే.

శుద్దోదక స్నానం సమర్పయామి: రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ.

వస్త్రయుగ్మం సమర్పయామి: రాజితం బహ్మసూత్రంచ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక.

ఉపవీతం సమర్పయామి: చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం.

గంధాన్ సమర్పయామి: అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్, గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే.

అక్షతాన్ సమర్పయామి: సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే.

 పుష్పాణి పూజయామి:

అథాంగ పూజ పుష్పాలతో పూజించాలి.

 గణేశాయ నమః - పాదౌ పూజయామి

ఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామి

శూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామి

విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి

అఖువాహనాయ నమః - ఊరూ పూజయామి

హేరంబాయ నమః - కటిం పూజయామి

లంబోదరాయ నమః - ఉదరం పూజయామి

గణనాథాయ నమః - నాభిం పూజయామి

గణేశాయ నమః - హృదయం పూజయామి

స్థూలకంఠాయ నమః - కంఠం పూజయామి

గజవక్త్రాయ నమః - వక్త్రం పూజయామి

విఘ్నహంత్రే నమః - నేత్రం పూజయామి

శూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామి

ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి

సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి

విఘ్నరాజాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి

ఏకవింశతి పత్రపూజ

ఏకవింశతి పత్రపూజ: 21 రకాల పత్రాలతో పూజించాలి.

 సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి।

గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి।

ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి।

గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి

 హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి।

లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి।

గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం పూజయామి।

గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి,

ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి,

వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి।

భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి,

వటవేనమః - దాడిమీపత్రం పూజయామి,

సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి,

ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి,

హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి

శూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి,

సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి,

ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి,

వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి,

సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి।

కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి।

శ్రీ గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి పూజయామి.

  

అష్టోత్తర శత నామ పూజా

ఓం గజాననాయ నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం విఘ్నరాజాయ నమః

ఓం వినాయకాయ నమః

ఓం ద్వైమాతురాయ నమః

ఓం ద్విముఖాయ నమః

ఓం ప్రముఖాయ నమః

ఓం సుముఖాయ నమః

ఓం కృతినే నమః

ఓం సుప్రదీప్తాయ నమః

ఓం సుఖనిధయే నమః

ఓం సురాధ్యక్షాయ నమః

ఓం సురారిఘ్నాయ నమః

ఓం మహాగణపతయే నమః

ఓం మాన్యాయ నమః

ఓం మహాకాలాయ నమః

ఓం మహాబలాయ నమః

ఓం హేరంబాయ నమః

ఓం లంబజఠరాయ నమః

ఓం హయగ్రీవాయ నమః

ఓం ప్రథమాయ నమః

ఓం ప్రాజ్ఞాయ నమః

ఓం ప్రమోదాయ నమః

ఓం మోదకప్రియాయ నమః

ఓం విఘ్నకర్త్రే నమః

ఓం విఘ్నహంత్రే నమః

ఓం విశ్వనేత్రే నమః

ఓం విరాట్పతయే నమః

ఓం శ్రీపతయే నమః

ఓం వాక్పతయే నమః

ఓం శృంగారిణే నమః

ఓం ఆశ్రితవత్సలాయ నమః

ఓం శివప్రియాయ నమః

ఓం శీఘ్రకారిణే నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం బల్వాన్వితాయ నమః

ఓం బలోద్దతాయ నమః

ఓం భక్తనిధయే నమః

ఓం భావగమ్యాయ నమః

ఓం భావాత్మజాయ నమః

ఓం అగ్రగామినే నమః

ఓం మంత్రకృతే నమః

ఓం చామీకర ప్రభాయ నమః

ఓం సర్వాయ నమః

 

 

 

ఓం సర్వోపాస్యాయ నమః

ఓం సర్వకర్త్రే నమః

ఓం సర్వ నేత్రే నమః

ఓం నర్వసిద్దిప్రదాయ నమః

ఓం పంచహస్తాయ నమః

ఓం పార్వతీనందనాయ నమః

ఓం ప్రభవే నమః

ఓం కుమార గురవే నమః

ఓం కుంజరాసురభంజనాయ నమః

ఓం కాంతిమతే నమః

ఓం ధృతిమతే నమః

ఓం కామినే నమః

ఓం కపిత్థఫలప్రియాయ నమః

ఓం బ్రహ్మచారిణే నమః

ఓం బ్రహ్మరూపిణే నమః

ఓం మహోదరాయ నమః

ఓం మదోత్కటాయ నమః

ఓం మహావీరాయ నమః

ఓం మంత్రిణే నమః

ఓం మంగళసుస్వరాయ నమః

ఓం ప్రమదాయ నమః

ఓం జ్యాయసే నమః

 

 

 

ఓం యక్షికిన్నరసేవితాయ నమః

ఓం గంగాసుతాయ నమః

ఓం గణాధీశాయ నమః

ఓం గంభీరనినదాయ నమః

ఓం వటవే నమః

ఓం జ్యోతిషే నమః

ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః

ఓం అభీష్టవరదాయ నమః

ఓం మంగళప్రదాయ నమః

ఓం అవ్యక్త రూపాయ నమః

ఓం పురాణపురుషాయ నమః

ఓం పూష్ణే నమః

ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః ?

ఓం అగ్రగణ్యాయ నమః

ఓం అగ్రపూజ్యాయ నమః

ఓం అపాకృతపరాక్రమాయ నమః

ఓం సత్యధర్మిణే నమః

ఓం సఖ్యై నమః

ఓం సారాయ నమః

ఓం సరసాంబునిధయే నమః

ఓం మహేశాయ నమః

ఓం విశదాంగాయ నమః

ఓం మణికింకిణీ మేఖలాయ నమః

ఓం సమస్తదేవతామూర్తయే నమః

ఓం సహిష్ణవే నమః

ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః

ఓం విష్ణువే నమః

ఓం విష్ణుప్రియాయ నమః

ఓం భక్తజీవితాయ నమః

ఓం ఐశ్వర్యకారణాయ నమః

ఓం సతతోత్థితాయ నమః

ఓం విష్వగ్దృశేనమః

ఓం విశ్వరక్షావిధానకృతే నమః

ఓం కళ్యాణగురవే నమః

ఓం ఉన్మత్తవేషాయ నమః

ఓం పరజయినే నమః

ఓం సమస్త జగదాధారాయ నమః

ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః

అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్

అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ..

దశాంగం గుగ్గలోపేతం సుగంధం, సుమనోహరం, ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ.. ధూపమాఘ్రాపయామి

సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే.. దీపందర్శయామి

సుగంధాసుకృతాంశ్చైవమోదకాన్ ఘృతపాచితాన్, నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్, భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ, ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక.. నైవేద్యం సమర్పయామి.

సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ, భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక.. సువర్ణపుష్పం సమర్పయామి.

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం.. తాంబూలం సమర్పయామి.

ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ.. నీరాజనం సమర్పయామి.

అథ దూర్వాయుగ్మ పూజా..

  • గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.
  • ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
  • అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
  • వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.
  • ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.
  • సర్వసిద్ది ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.
  • ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.
  • ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.
  • మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.
  • కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి.
  • ఏకదంతైకవదన తథామూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.
  • కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి.

నమస్కారము, ప్రార్థన

ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన.. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి,

అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన.. పునరర్ఘ్యం సమర్పయామి,

ఓం బ్రహ్మవినాయకాయ నమః

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన, ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్.

వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ.. నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.

వినాయక దండకం

పార్వతీ పుత్రా, లోకత్రయీస్త్రోత్ర, సత్సుణ్య చరిత్ర, సర్వార్థసంపత్ప్రదా! ప్రత్యబ్దసంపూజితా!

నిన్ను విద్యాలయంబందు విద్యార్థిసంఘంబులౌ మేము సద్భక్తితో స్థాపనం జేసియున్నార మీవేళ నీవద్ద బద్ధాంజలీయుక్తమౌ ముద్రలందాల్చి సప్తాహపర్యంత మాపైన రెన్నాళ్లు నిత్యంబు వేళాద్వయంబందు శ్రద్ధాఢ్యతంబూని పూజించగా నిల్చియున్నార మోదేవ!

మున్ముందుగా నాచతుర్థిన్ సుకల్పోక్తరీతిన్ విశేషంబులైనట్టి పత్రాదిసామగ్రినిం దెచ్చి, టెంకాయలున్ పుష్పముల్, మాలలున్, ధూపముల్, దీపముల్ గూర్చి, సత్పూజలం జేసి, యుండ్రాళ్ళు, వడ్పప్పు, బెల్లంబు, పండ్లప్పముల్, గారెలున్, బూరెలున్ దెచ్చి రుచ్యంబుగా నీకు నైవేద్యముల్ చూపి, విఘ్నేశ్వరోత్పత్తియు న్నాశ్యమంతాఖ్యమై యొప్పు నాఖ్యానమున్ శ్రద్ధతో నేకచిత్తంబునుంబూని చెప్పించుకొన్నాము, మంత్రోక్తరీతిన్ సుపుష్పంబు లందించియున్నాము, ఛత్రాదులున్, చామరంబుల్, సుగీతంబులున్నీకెయర్పించియున్నార మోదేవ! యీదీక్షలో నిత్య మీరీతి సూర్యోదయంబందు, సాయాహ్నకాలంబునన్ నిన్నె యర్చించుచున్నాము, పూజావిధానంబు, మంత్రంబులం నేర్వలేమైతి అత్యుత్తమంబైన సద్వాక్య సంపత్తి యింతేనియున్ లేని యజ్ఞాన మందున్న మేమిచ్చటన్ జేయుచున్నట్టి పూజాదిసర్వోపచారంబులం స్వీకరించంగ నిన్వేడుచున్నాము, మాపైని కారుణ్యముంజూపుమా, యజ్ఞానమున్ ద్రుంచుమా, దోషముల్ సైచి, సద్విద్యలందించుమా, ధాత్రిలో మాకు సద్బుద్ధి, విజ్ఞానసంపత్తి, సత్కీర్తి, యారోగ్యభాగ్యంబు, సత్త్వంబు, సన్మార్గసంచారధైర్యంబు, సత్పాత్రతాదీప్తితోడన్ జయం బెల్లకాలంబులం గూర్చి, సత్పౌరులం జేయుమా, దేశభక్తిన్ సదానిల్పి విద్యాభివృద్ధిన్ ప్రసాదించి మమ్మున్ వివేకాఢ్యులం జేయుమా, దేవదేవా! మహాకాయ! లంబోదరా! ఏకదంతా! గజాస్యా! సదావిఘ్ననాశా!మహేశాత్మజాతా! ప్రభూ! నాగయజ్ఞోపవీతా! భవానీతనూజా!త్రిలోకైకనాథా! సదామందహాసా! సురేంద్రా! గజేంద్రాననా! శూర్పకర్ణా! నమస్తే నమస్తే నమస్తే నమః

వినాయక వ్రత కథ

 వినాయక వ్రత కథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి.

తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీమహావిష్ణువు విముక్తి కల్పిచడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగుపిండిని అద్దుకుంది.

పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారుచేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది.

 దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్లింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు....ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీ దేవి, జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు...గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు.

అతడి శక్తి సామర్ధ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడి నడవటానికి ఇబ్బందిపడుతూ కైలాసం చేరుకున్నాడు.

 శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. రాజ‌దృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయని విఘ్ననాధుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు.

దీంతో ఆగ్రహించిన పార్వతి దేవి.. పాపాత్ముడా నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు.. కాబట్టి నిన్నుచూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక అని శపించింది.

ఋషి పత్నులకు నీలాపనిందలు

పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలసి యజ్ఞం చేస్తూ, అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక, శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది.

అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు, వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్థుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు.

తర్వాత పార్వ‌తీదేవితో ‘అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది. కావున శాపాన్ని ఉపసంహరించుకో’ అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ‘ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు’ అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి, సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది. 

శమంతకోపాఖ్యానం

 ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక ‘స్వామీ! ఈ రోజు వినాయక చవితి. పార్వతి శాపం కారణంగా చంద్రుని చూడకూడదు. నేను వెళ్తాను’ అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్లిపోయాడు.

ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి.

సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు. రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు.

అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరచుకుని పోతూన్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు.

 శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు.

భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషంవల్ల తన మీద నింద పడిందనుకున్నాడు. శమంతకమణిని వెదుకుతూ అడవికి వెళ్లాడు. ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి.

వెదుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి, దానిని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు.

త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు.

నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు.

 ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో ‘మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మావంటి వారికి ఏది గతి?’ అన్నారు.

‘భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి, ఆరోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు.

ఆ నాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు.ఈ కథను చదివి గాని, విని గాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారాలు చేయాలి.

 

కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి... అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి.

ఉద్వాసన మంత్రం.

యఙ్ఙ‌ేన యఙ్ఙ‌మయజంత దేవాస్తాని ధర్మాణి ప్రధమాన్యాసన్, తేహనాకంమహిమానస్సచంతే యాత్ర పూర్వేసాధ్యాస్సంతిదేవా!!

సర్వేజనా సుఖినో భవంతు

 ఈ సంవత్సరం గణేశ చతుర్తి ఆగస్ట్ 22న శనివారం వస్తోంది. ఆ రోజు రాత్రి 7.57 వరకూ గణేశ చతుర్థి ఉంటుంది. 7.10 నుంచి హస్తా నక్షత్రం దర్శనమిస్తుంది.

 హిందూ పురాణాల ప్రకారం... ఆగస్ట్ 22న మధ్యాహ్నం 12.22 నుంచి సాయంత్రం 4.48 వరకూ అమృత గడియలు, లాభ కాలంగా చెబుతున్నారు. ఆ సమయంలో... గణేశ ప్రతిమను ప్రతిష్టిస్తే మేలంటున్నారు.

 వినాయక చవితి నాడు చందమామను చూడకూడదనేది ఆచారం. పొరపాటున చందమామను చూస్తే  వ్రత కథను మరల చదివి నెత్తిన అక్షంతలు వేసుకోమని పెద్దలు చెపుతుంటారు. దానికి ప్రతిగా... మర్నాడు పేదలకు తెల్లటి వస్త్రాలు, తెల్లటి ఆహార పదార్థాల వంటివి ఏవైనా దానం చేయాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు.

 

Note: please Comment Here for UPDATES and CORRECTIONS 

Why news media is in crisis & How you can fix it.

India needs free, fair, non-hyphenated and questioning journalism even more as it faces multiple crises. But the news media is in a crisis of its own. There have been brutal layoffs and pay cuts. The best of journalism is shrinking, yielding to the crude prime-time spectacle. My digital news .in  has very few young reporters, columnists and editors working for it. Sustaining journalism of this quality needs smart and thinking people like you to pay for it. Whether you live in India or overseas, you can do it here

Donate. https://mydigitalnews.in/donate  

NOTE: Please email us for updates and corrections, if you wish to publish articles like this you can send them to info@mydigitalnews.in  or mydigitalnews.in@gmail.com  or you can Directicle write Articles on our Site by registering https://mydigitalnews.in/register  

Disclaimer: Mydigitalnews.in provides the content from various information sources ‘as is and the content to be used only for informational purposes and not responsible for the inaccuracy or deficiency of the provided information. Mydigitalnews. in have the right, at its sole discretion, to make modifications in any aspect of the provided information.

Mydigitalnews. in Internet site may contain links to other Internet sites. While we try to link only to sites that share our high standards and respect for privacy, we are not responsible for the content or the privacy practices employed by other sites.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

SANGEE my life is god